రెండున్నరేళ్ళలో లక్ష మందా?
రెండున్నరేళ్ళలో లక్ష మంది వీక్షకులంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది...సహాయ సహకారాలు అందించిన పెద్దలందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు - ఎందరో మహానుభావులు, సభాముఖంగా అందరికీ వందనములు
ఎన్నో తిట్లు, శాపనార్థాలూ, శాపాలు, కోపాలు, తాపాలు, దీవెనలు, సూచనలు, అభినందనలు మధ్య పెరుగుతున్న ఈ బుడ్డోడి జీవితం ఎటు సాగుతుందో ఇక పైన!! అన్నిటినీ ఒకేలా స్వీకరిస్తూ, చిద్విలాసాలు చిందిస్తూ నిర్వేద నిర్వికార రూపు సంతరించుకుని తన పని తను చేసుకుని పోవటమే తక్షణ కర్తవ్యమేమో ..
వీరిలో ఎంత మంది తిరుగు జనాలో తెలియదు కానీ, నిన్న రాత్రి కూర్చుని ఏదో చూస్తుంటే, అనుకోకుండా స్టాటిస్టిక్స్ లో సంఖ్యలు కూడగా వచ్చిన "unique visitors" సంఖ్య
జూలై - డిసెంబరు 2005 - 1286
2006 సంవత్సరంలో - 38487
డిసెంబరు 18 2007 వరకు - 64239
సహాయ సహకారాలు అందించిన పెద్దలందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు - ఎందరో మహానుభావులు, సభాముఖంగా అందరికీ వందనములు
Wednesday, December 19, 2007
Subscribe to:
Post Comments (Atom)
11 comments:
అభినందనలు.మీకా అర్హత వుంది.
ధన్యవాదాలు రాధిక గారూ ...తిట్లు, శాపనార్థాలూ, శాపాలు, కోపాలు, తాపాలు, దీవెనలు, సూచనలు, అభినందనలు - ఏదయినా ఇష్టమే.
ఈ బుడ్డోడి అర్హత మీలాంటి చదువరులే నిర్ణయించాలె. చేసే ఏ పని అయినా బాధ్యతగా భావించే మనిషినే కానీ, దాని అర్హతల గురించి ఆలోచించే స్థాయికి ఇంకా ఎదగలేదు..
అంతర్జాలంలో తెలుగు కోసం వెతుకుతున్నప్పుడు తగిలిన మల్లెతీగ మీ/మా మాగంటి.ఆర్గ్ - మరిలా నాలా ఎందరో? మీ శ్రమకు తగ్గ గుర్తింపే ఈ లక్ష నొక్కుల సన్మాన పత్రం. ఈ సందర్భంగా మీకు నా తరఫున లక్ష వీరతాళ్లు!
డాక్టర్ గారూ - మీ అభిమానానికి కృతజ్ఞతలు...కానీ మీరు ఏమనుకోనంటే ఒక మాట - నేను పడ్డది శ్రమ అని , దాన్ని అందరూ గుర్తించి నాకు సన్మాన పత్రాలు ఏవో ఇవ్వాలి అని మటుకు కోరుకోలేదు...అయ్యో నేను ఇంత ఇదిగా రాస్తే ఈయనేంటి, ఒక్క మాటలో ఇలా తీసిపారేసాడు అని మటుకు అనుకోకండి..నా మటుకు నాకు పెద్దవాళ్ళు మనకు అందించిన జ్ఞానాన్ని మన తరువాతి తరాలకు అందచేయటమే మన మీద ఉన్న అతి పెద్ద బాధ్యత - అది భాష పరంగా కానివ్వండి , ఆ భాష లో ఇమిడిఉన్న సాహితీ సంపద పరంగా కానివ్వండి, సంస్కృతీసాంప్రదాయ పరంగా కానివ్వండి...దానిని కొంత మంది మెచ్చారు, కొంత మంది తెగిడారు, చాలా మంది నిరుత్సాహపరిచారు, కోప్పడ్డారు,(మచ్చుకి ఒక పెద్దాయన - నీ లాంటి వాళ్ళు నీకన్నా ఎన్నోతరాల ముందు నుంచీ చాలా మంది చాలా చెయ్యాలి అని చూసారు - బూడిద తప్ప ఏమీ మిగలలేదు, నువ్వు శ్రమ పడవలసిన అవసరం లేదు, పడ్డా ఫలితం దక్కదు అని ఘాటుగా చెప్పాడు - అది మరి ఆయన ఆక్రోశమో, ఆవేదనో ఆ భగవంతుడికీ ఆయనకే తెలియాలి), నీ బతుకు, నీ భాష బతుకు, నీ వెబ్సైటు బతుకు గంగలో కలవాల్సిందే అని శాపనార్థాలు పెట్టినవాళ్ళు ఉన్నారు - కానీ ఒక పని నాకు నచ్చిందంటే అది ఆరు నూరయినా చేసి తీరే ఉడుకు రక్తం నాది - ఆ పని తప్పు పని అయినా సరే, ముందు నచ్చింది చేసేసి తరువాత ఒకవేళ పరిణామాలు తప్పుగా వస్తే మనఃస్ఫూర్తిగా క్షమాపణలు కోరుతూ సరిదిద్దుకునే మనస్తత్వం అయిపోయె నాది...ఏం చేస్తాం?...
సరే.... ఇక ఇలా రాస్తూ పోతూ ఉంటే ఇంకా చాలా బయటికి వస్తాయి...ఏదేమయినా మీ అభిమానానికి మళ్ళీ కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ
- శెలవు
రెండున్నరేళ్ళు. లక్షమంది! ఎన్ని కష్టనష్టాల కోర్చి వుంటారో గదా. ఎంతో అభినందనీయం. లక్ష హిట్లు సాధించిన తెలుగు బ్లాగు ప్రధమం మీదేనా. ఇంకెవరైనా ఉన్నారా. తెలీక అడుగుతున్నా. మరోసారి అభినందనలతో కొనసాగించమని కోరుతూ. . .
విజయ్ కుమార్ గారూ - ఈ వైపు తొంగిచూసినందుకు ధన్యవాదాలు...నేను రాసింది మాగంటి.ఆర్గ్ గురించి అండి...ఈ బ్లాగు గురించి కాదు... :)
ఎంత మాటన్నారండీ వంశీ గారూ 'ఈ వైపు తొంగి చూసినందుకు' అంటూ. నేను వృత్తి రీత్యా బాగా బిజీ. స్వంత టపా రాసే 23 రోజులైంది. వృత్తి సమయంలోనే ఏమాత్రం తీరిక దొరికినా టపా రాయలేకపోయినా ఏదో మనసుకి నచ్చిన టపా చూసి అదెవరిదైనా సరే ఒక వ్యాఖ్య రాస్తాను. సాధ్యమైనంత వరకూ బాధ్యతగా రాస్తాను. అంతే గానీ ఏ బ్లాగు మీద గానీ, ఏ వ్యక్తుల మీద గానీ నాకు వ్యక్తిగతంగా వేర్పాటు భావన వుండదు. కాకుంటే ఎవరి టపా అయినా పాలసీకి విరుద్ధంగానూ, చవకబారుగానూ వుంటే మాత్రం కొంత సున్నితం గానూ, ఒకింత ఘాటు గానూ విమర్శిస్తాను. అది 'అనోనిమస్' పేరుతోనైనా సరే. ఒకవేళ టపా చదివినా నాకు నచ్చనప్పుడు వ్యాఖ్య చెయ్యకుండా మిన్నకుండి పోతాను. అంతేనండి. కృతజ్ఞతలతో. . .
వంశీగారు ,
మీకు అభినందనలు. నిజంగా మీ సైటు ఒక విజ్ఞాన భాండాగారం. చాల శ్రమకోర్చి దాన్ని నిర్వహిస్తున్నారు. మీ కృషి ఇలాగే ఎప్పుడు విజయవంతంగా కొనసాగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.
జ్యోతిగారు ధన్యవాదాలు ...ఒక మంచి మనసున్న పెద్దాయన చెప్పినట్టు "మనస్సుకు ఆనందానిచ్చేది శ్రమ ఎలా అవుతుంది"?
నేను శ్రమ అని ఎప్పుడూ అనుకోలేదు, అనుకోను...ఇది ఒక బాధ్యత మాత్రమే
వంశీ గారూ.. మీ సైట్ వెనుక మీ కృషి చాలా దాగుంది. మీ సైట్ వ్యక్తిగతంగా నాకు ఎంతో నచ్చి గతంలో ఓ రివ్యూలో మా కంప్యూటర్ ఎరా పత్రికలో రాశాను. మీ స్టాటిస్టిక్స్ చూస్తుంటే ఆనందం కలిగింది.
- నల్లమోతు శ్రీధర్
అభినందనలు.
రెండేళ్ళ క్రితం గూగుల్ లో తెలుగు కోసం వెదుకుతున్నప్పుడు A pure telugu website initiated ... అంటూ నా కంటబడింది maaganti.org
Post a Comment