Wednesday, August 31, 2016

ఇద్దరు జమాజెట్టీల్లాంటి కోడళ్ళు !

అనగనగా ఒక ఊరు

ఆ ఊళ్ళో ఒక ఆడావిడ

ఆవిడకు ఇద్దరు కొడుకులు

కొడుకులిద్దరికీ పెళ్ళీ పెటాకులు అయినాయ్

ఇద్దరు జమాజెట్టీల్లాంటి కోడళ్ళు

అత్త సంగతి తలుపు చెక్కతో నేనొకటంటా, తాంబూలం చెక్కతో నువ్వొకటను అని ఇద్దరూ వంతుల మీద వంతులు

ఇంతలో పులి మీద పుట్రలా హఠాత్తుగా ఆవిడకున్న ఏకైక దిక్కు, ఆవిడ మొగుడు కాలం చేసినాడు

కష్టాలు డబలు త్రిబులు చబులు అయినాయి

అబ్బాయిలిద్దరూ తెత్తెన్నా కింద మారిపోయినారు

కానీ భక్తిపరురాలవ్వటంతో రోజు పువ్వూ కాయ నైవేద్యంగా పెట్టి ఆ శివయ్యకు తన కష్టాలు చెప్పుకునేది

విన్నాడు విన్నాడు ఆ కష్టాలన్నీ విన్నాడు ఆ పెద్దాయన

ఓ రోజు ఓ గోనెసంచీ పుచ్చుకుని ప్రత్యక్షమయ్యాడు

అమ్మా, నీ కష్టాలన్నీ ఈ గోనెసంచీలోకెక్కించెస్తున్నా. ఈరోజు నుంచి నీకు కష్టాలుండ వ్ ఫో అన్నాడు

ఎట్టెట్టా సామీ అని హాస్చర్యపోయింది ఆవిడ

ఆవిద చెవిలో ఓ మాట ఊది వెళ్ళిపోయినాడు పెద్దాయన

ఆరోజు పెద్దకోడలు పళ్ళెంలో అన్నం పెట్టి ఈవిద దగ్గరకు గిరవాటు వేస్తూ, ఆవిడ పక్కనే ఉన్న గోనెసంచి చూసింది

ఆవిడ కు అర్థం కాలా, ఆ సంచీ ఏమిటన్నది

పక్కన చేరింది ఎన్నడూ లేనిది

అత్తా అత్తా ఏముంది అందులో అని ప్రశ్న

ముసలావిడ ఆ ఏముంది మా ఆయన బతికున్నప్పుడు కొన్న నగలూ అవీ, కసిన్ని డబ్బులు ఈ గోతాం నిండా నింపి మా నాన్న దగ్గర దాచిపెట్టా. నిన్న మా బావకిచ్చి పంపించాడు, ఇప్పుడన్నా ఉపయోగించుకోమని అని ఓ మాట చెప్పి ఊరకున్నది

అంతే పెద్ద కో మొహం వెలుగ్స్

కాళ్ళొత్తడం మొదలుఎట్టింది

పచ్చడి మెతుకుల బదులు పిండివంటలు పెట్టింది

ఇది చూసి రెండోకో నేనేనా తక్కువ తిన్నదని ఇంకో ఆకు ఎక్కువ చదివించింది

అట్లా మొత్తానికి రెణ్ణెళ్ళు గడిచినాయ్

ముసలమ్మ ఓ రోజు ఇద్దర్నీ పక్కన కూర్చోబెట్టుకొని - ఇదిగో అమ్మాయిలు , ఇదంతా నేనేం ఖర్చు పెట్టుకుంటా కానీ, నాకెందుకో నే పోయే కాలం దగ్గరకు వచ్చినట్టనిపిస్తోంది - మీ ఇద్దరికి చెరిసగం ఇచ్చేస్ద్దామని నిశ్చయించుకున్నా - నే పోగానే పంచుకోండి అని అన్నది

ఆవిడ అన్నట్లుగానే ఆర్నెల్లలో పోయింది పాపం

సంచీలు చించారు కోడళ్ళు

చిత్తుకాయితాలు, చినిగిన గుడ్డలు, చిల్లపెంకులు, చిల్లుకానీలు ఉన్నవి అందున

అంతే!

కోడండ్లిద్దరూ ఢామ్మని కింద పడి నడుము ఒకావిడ, మోకాలు ఒకావిడ విరక్కొట్టుకునె

అట్లా ఓం తత్ సత్ జరిగినది

(సెప్టెంబరు 13, 2011)

తా.క - ఈ కాలంలో అయితే పూర్తి భిన్నంగా ఉందేదనుకో - అది వేరే సంగతి... కానీ తాడి తన్నే ఉపాయాలు ఆయన కల్పిస్తూనే ఉంటాడుగా! అది జ్ఞప్తికి పెట్టుకోవలె